BDK: టేకులపల్లి మండలం కిష్టారం గ్రామపంచాయతీ సర్పంచ్ రామకృష్ణ వివాహానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్, కోయగూడెం సర్పంచ్ సుభాష్ చంద్రబోస్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.