కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్ సందడి చేశారు. ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, కాసేపు ముచ్చటించారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయ, సినీ రంగ ప్రముఖులు కలిసిన ఈ అరుదైన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.