NZB: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సిరికొండలో సర్పంచ్, కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రజాప్రతినిధులు సమీక్షించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల మెరుగుదలపై ప్రజల నుంచి సూచనలు స్వీకరించారు. అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అధికారులు పేర్కొన్నారు.