ADB: వైద్యం పేరుతో ఆరోగ్యాన్ని బాగు చేస్తామని మాయమాటలు చెప్పే బాబాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వన్ టౌన్ CI సునీల్ కుమార్ సోమవారం తెలిపారు. పట్టణంలోని రెండు వేరువేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఉస్మాన్, ఎత్తేశం అనే ఇద్దరు బాబాలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అనారోగ్యంగా ఉంటే వైద్యులను సంప్రదించి నయం చేసుకోవాలని సూచించారు.