NLR: కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మాయ మాటలు చెప్పి, వారిని నిలువునా మోసం చేసిందని MLC పర్వతరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని YSR కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాల మేలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వారిని గాలికొదిలేసిందని ఆరోపించారు.