WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏసీపీలుగా పనిచేస్తున్న ఐపీఎస్(2022) అధికారులకు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి కల్పించారు. జనగామ ఏసీపీగా ఉన్న చేతన్ నితిన్, వరంగల్ ఏసీపీగా ఉన్న శుభం ప్రకాశ్‌ను బదిలీ చేశారు. చేతన్ నితిన్‌ను జగిత్యాల అడిషనల్ ఎస్పీగా,ప్రకాశ్‌ను నిజమాబాద్ అడిషనల్ ఎస్పీగా బదిలీ చేశారు.