ఏలూరు ఎన్.ఆర్.పేటలోని ఇండియన్ బ్యాంకులో శనివారం సాయంత్రం సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బ్యాంకు గోల్డ్ అప్రెజర్ కృష్ణ రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో బ్యాంకు మేనేజర్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు. కాగా రాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది.