HNK: అంతర్జాతీయ స్థాయిలో వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన చారిత్రక కట్టడాల పరిరక్షణలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాకతీయుల కళా వైభవం, శిల్ప సంపద, చారిత్రక కట్టడాలు తెలంగాణకు గర్వకారణమన్నారు.