రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త అవతారం ఎత్తాడు. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్‌తో కలిసి ఓ మైథలాజికల్ గ్లోబల్ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ‘ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమ’ అంటూ విడుదలైన పోస్టర్ అంచనాలు పెంచుతోంది. ‘హౌస్ అఫ్ ది డ్రాగన్’ వంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్స్ వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో భాగం కావడం విశేషం.