KMM: సత్తుపల్లి, పెనుబల్లి మండలాలలో ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పలు చలివేంద్రాలలో ప్రారంభించారు. అలాగే ఇందిరా మహిళా శక్తి ద్వారా మదర్ యూనిట్ ద్వారా మహిళలకు పెరటి కోళ్లను పంపిణీ చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అన్నారు.