TG: HYDలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్(ROB) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రూ.71 కోట్ల వ్యయంతో, 490 మీటర్ల పొడవున 4 లేన్లతో ఈ వంతెనను నిర్మించారు. సికింద్రాబాద్-ఫలక్‌నుమా రైల్వే లైన్‌పై ఉన్న ఈ ROBని CM రేవంత్ త్వరలోనే ప్రారంభించనున్నారు. దీని వల్ల శాస్త్రిపురం, శివరాంపల్లి ప్రాంతాల మధ్య ప్రయాణం సులభమవుతుంది.