KDP: చెన్నూరు మండలంలో ‘జలధార -జలహారతి’ కార్యక్రమం అమలులో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు ఆధ్వర్యంలో రుద్రభారతిపేట, గుర్రంపాడు చెరువులను పరిశీలించి పలు అభివృద్ధి పనులను గుర్తించారు. ఈ పర్యటనలో మైనర్ ఇరిగేషన్ ఈ జిలాని, ఏపీవో శైలజ, డిస్ట్రిబ్యూటరీ ఛైర్మన్ వెంకట సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.