KNR: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల స్థితిపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం కలెక్టర్ చిత్రమిశ్రా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే.. ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మున్సిపాలిటీ, రెవెన్యూ, సంక్షేమ శాఖ, నీటిపారుదల శాఖ, విద్యుత్, వెటర్నరీ, పంచాయతీ తదితర శాఖల వద్ద పెండింగ్ వివరాలు తెలుసుకున్నారు.