AP: కూటమి పాలనలో నిధుల కొరత లేదని మంత్రి ఆనం అన్నారు. రూ.83 కోట్లతో రాష్ట్రంలోని 706 ఆలయాల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 679 భజన మందిరాలను మంజూరు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. త్వరలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మూడు సార్లు జరగడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణంగా ఉందన్నారు.