NLG: చిట్యాల పురపాలిక ఆరవ వార్డు పరిధిలోని వెంకటాపురంలో సోమవారం గ్రామస్తులు గుర్తు తెలియని శవం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. మృతి చెందిన వ్యక్తి ఎవరు? లేక హత్య చేసి అక్కడ పడేసి వెళ్లారా? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేయవలసి ఉంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.