AKP: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ పరవాడలో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వరుసగా ఇంధన ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతోందని జిల్లా అధ్యక్షులు పీ. మాణిక్యం విమర్శించారు. మహిళలకు ఉపాధి, భద్రత కల్పించాలని, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.