ప్రముఖ కమెడియన్ సత్య హీరోగా, దర్శకుడు రితేష్ రానా కాంబోలో వస్తున్న చిత్రం ‘జెట్లీ’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. మే 1న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.