HNK: హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహా ధర్నాకు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ ఆధ్వర్యంలో సుమారు 400 మంది యూత్ కాంగ్రెస్ నేతలు తరలి వెళ్లారు. కెఆర్ దిలీప్ మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, దేశానికి వెన్నెముక రైతు అని, రైతు సంక్షేమానికి కేంద్రం పెద్దపీట వేయాలన్నారు.