తన భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్ స్పష్టంచేశారు. అవన్నీ అబద్ధాలేనని, వాటిని ఎవరూ నమ్మవద్దని కోరింది. కాగా కాంబ్లీ ఆరోగ్యం బాలేదన్న విషయాన్ని ఆయన ఫ్రెండ్, మాజీ అంపైర్ మార్కస్ కౌటో చెప్పడం గమనార్హం.