AP: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో NDA దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిడదవోలులో చేపట్టిన నిరసన ర్యాలీలో CM చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలకు ద్రోహం అంటే జాతి విద్రోహమని, మహిళల విషయంలో ఇలా చేయడం బాధిస్తోందని పేర్కొన్నారు.