అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.ఎస్.భానుమతికి శనివారం ఘన స్వాగతం లభించింది. ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా జడ్జి భీమారావు, ఎస్పీ జగదీష్ ఆమెను మర్యాదపూర్వకలగా కలిసి పూలమొక్కను అందజేశారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.