KRNL: మంత్రాలయం(M) చిలకలడోన గ్రామ సమీపాన గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదం జరిగిన రోజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన దీపిక, బెల్లి, యశోద, పుట్టమ్మ, లాలాక్షి, మీనాక్షి, సునీల్, కుమార్ మృతిచెందారు. కర్నూలు GGHలో చికిత్స పొందుతూ తేజస్విని శుక్రవారం మృతి చెందింది. నేడు శోభ అనే మహిళ మరణించింది.