KDP: ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో రౌడీషీటర్లకు ఇవాళ కౌన్సెలింగ్ జరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు ఏఎస్పీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో, వివిధ నేరాలలో ముద్దాయిలై రౌడీషీటర్లుగా నమోదైన వారికి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.