HYD: బల్కంపేట ఎల్లమ్మ పుణ్య క్షేత్రాన్ని అత్యంత శోభాయమానంగా అలంకరించారు. ఆదివారం అర్చకులు, ఆలయ అధికారులు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. అమ్మవారి గర్భగుడిని పలురకాల పువ్వులతో సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.