MNCL: తాండూర్ మండలం మల్లన్న గుట్ట వద్ద ఉపాధి హామీ కూలీలకు వింత కష్టాలు వచ్చి పడ్డాయి. ముఖ గుర్తింపు (ఫేషియల్ అటెండెన్స్) కోసం సిగ్నల్ అందక కూలీలు చెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెట్వర్క్ సమస్యతో హాజరు నమోదు కావడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు నెట్వర్క్ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.