GDWL: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ పచ్చర్ల కుమార్ అన్నారు. ముండ్లదిన్నెలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.