SDPT: హైదరాబాద్లో జరిగిన 9వ రాష్ట్రస్థాయి తైక్వాండో సబ్ జూనియర్ పోటీల్లో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు మెరిశారు. కోచ్ చింతకాయల స్వామి శిక్షణలో ద్యూతి రెడ్డి, శాన్వి, జ్ఞాన ప్రసన్న, శ్రీ హర్ష, హర్షిత్ తదితరులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. తక్కువ కాలంలోనే ప్రతిభ చాటిన విద్యార్థులను కోచ్ అభినందిస్తున్నారు.