లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా పీకల్లోతు కష్టాల్లో పడింది. మొహ్సిన్ ఖాన్ (3 వికెట్లు) నిప్పులు చెరగడంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రహానె, సిఫర్ట్, పావెల్‌లను మొహ్సిన్ పెవిలియన్ పంపాడు. రఘువంశీ వివాదాస్పదంగా ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ నిర్ణయంతో వెనుదిరిగాడు. ప్రస్తుతం గ్రీన్, రింకూ క్రీజులో ఉన్నారు.