SRD: రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తోందని టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో ఆమె మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు వాసవి కన్యకాపరమేశ్వరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందని తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.