NGKL: సంసద్ ఖేల్ మహోత్సవ్‌లో ఊర్కొండపేట ఎంజేపీ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించి రూ.45 వేల బహుమతిని ఎంపీ డీకే అరుణ చేతుల మీదుగా అందుకున్నారు. క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.