SKLM: పొందూరు మండలం లోలుగుకి చెందిన జనసేన కార్యకర్త వెంకటస్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన జిల్లా అధ్యక్షుడు పి .చంద్రమోహన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రావు ఇవాళ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. జన సైనికుల సహకారంతో సేకరించిన రూ. 40 వేల ఆర్థిక సహాయం అందజేసి, భవిష్యత్తులో అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.