RR: ఫరూఖ్ నగర్ మండలం రాయికల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీ పరికరాలపై అవగాహన కల్పించారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎలా తప్పించుకోవాలి, వెలువడే మంటలను ఎలా అదుపులోకి తీసుకురావాలనే దానిపై ఫైర్ సేఫ్టీ సీఐఎస్ఎఫ్ అధికారులు సిలిండర్ తో ప్రయోగం చేసి చూపించారు. ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు.