MLG: ఏటూరునాగారం 12వ వార్డు మానసపల్లిలో పాఠశాలను ఎంఈఓ మల్లయ్య, వార్డు మెంబర్ కృష్ణవేణి సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎంఈఓ మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని, పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎంఈఓ అన్నారు.