BDK: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ సందర్శించారు. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం అమ్మవారిని దర్శించి ప్రసాదం స్వీకరించారు.