TG: కాంగ్రెస్ మొదటి నుంచి మహిళా వ్యతిరేకి అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాహుల్, రేవంత్ ముమ్మాటికీ మహిళా ద్రోహులేనని విమర్శించారు. మహిళా బిల్లును అడ్డుకుంది కుటుంబ పార్టీలేనని తెలిపారు. కాంగ్రెస్ దేశ మహిళలను ఓడించిందని చెప్పారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఇండి కూటమిని చిత్తుగా ఓడించండని పిలుపునిచ్చారు.