TG: బీజేపీ చేస్తున్న మోసాలను తెలుగు రాష్ట్రాల ఆడబిడ్డలు గుర్తించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్లో ఓ మహిళా నాయకత్వం వహిస్తున్నారని, ఆ మోసకారి బీజేపీని ఓడించి ఆమెను గెలిపించాలని కోరారు. బెంగాల్లో ఉన్న మీ స్నేహితులకు ఈ విషయం చెప్పాలని సూచించారు. మహిళా సాధికారతపై బీజేపీ చేస్తున్నవి అన్నీ కపట నాటకాలేనని ఆమె ధ్వజమెత్తారు.