PPM: టీనేజ్ ప్రెగ్నెన్సీ వలన కలిగే అనర్దాలపై శుక్రవారం కలెక్టరేట్లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొని కౌమార దశలో గర్భధారణ – దుష్ప్రభావాలపై పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం, గర్భం దాల్చడం వంటి విషయాలపై యువతకు అవగాహన తప్పనిసరని అన్నారు.