KMM: ఏన్కూర్ మండలంలో నేడు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటించనున్నారు. మండల కేంద్రంలోని మధ్యాహ్నం 3:00 గం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన క్యాంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. కావున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని వారు కోరారు.