KRNL: లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై శుక్రవారం మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సరిహద్దులను కాపాడే సైన్యాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. పుల్వామా వంటి ఉదంతాలను తక్కువ చేసి మాట్లాడటం రాహుల్ అవివేకానికి నిదర్శనమని అన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా రాహుల్ ఏదో తెలియని మానసిక ఆనందం పొందుతున్నారన్నారు.