SDPT: అప్రమత్తంగా ఉండటం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. గజ్వేల్ మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైవేలపై ఎడమ వైపే ప్రయాణించాలని, రాత్రి వేళల్లో లో-బీమ్ లైట్లు వాడాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు.