పెళ్లికి ముందు బరువు తగ్గాలని చాలామంది షార్ట్కట్ మార్గాలు వెతుకుతున్నారు. డయాబెటిస్ బాధితులకు ఇచ్చే టర్జెపటైడ్, సెమాగ్లూటైడ్ వంటి ఇంజెక్షన్లను బరువు తగ్గడానికి వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇవి తాత్కాలికంగా బరువు తగ్గించినా, ఆపగానే మళ్లీ రెట్టింపు బరువు పెరగడం, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. నిపుణుల సలహా లేకుండా ఇవి వాడటం శ్రేయస్కరం కాదు.