PDPL: ధర్మారం ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఆరవ తరగతి, 7 నుంచి 10వ తరగతి సీట్ల కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 19న 6వ తరగతి పరీక్ష ఉదయం 10గం. నుంచి 12గం. వరకు, 7-10 తరగతుల మధ్యాహ్నం 2 గం. నుంచి 4 వరకు జరుగుతుందన్నారు.