VSP: నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో శనివారం రాత్రి విశాఖపట్నం నగరానికి రానున్నారు. ఆయన ఈ నెల 26వ తేదీ వరకు రుషికొండలోని Pema Wellness Resort లో బస చేయనున్నారు. అనంతరం 27వ తేదీన నాగాలాండ్‌కు తిరిగి బయలుదేరి వెళతారని అధికారులు వెల్లడించారు. ఆయన పర్యటన సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.