ADB: ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని ఇంఛార్జ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ తెలిపారు. గతంలో కేవలం పౌర విమానయానానికి (ఎయిర్ పోర్ట్ అథారిటీ) పరిమితం అనుకున్న ఈ విమానాశ్రయం, తాజాగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ (శిక్షణ కేంద్రం)గా కూడా అభివృద్ధి చెందనుంది. ఇందుకోసం అదనంగా భూమిని సేకరించి, రక్షణ శాఖకు అప్పగించనున్నారు.