MUL: వాజేడు మండలం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి గోపాలరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్ష నిర్వహించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.