KMR: పెద్ద కొడఫ్గల్ మండలం అంజనీ చౌరస్తా వద్ద ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గుంటూరు నుంచి గుజరాత్‌కు లారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. లారీలో లోడ్ చేసిన 720 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిని సీజ్ చేశారు.