ప్రకాశం: జిల్లా SP హర్షవర్ధన్ రాజు ప్రజలకు శనివారం కీలక సూచనలు జారీ చేశారు. వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరని స్పష్టం చేశారు. కొంతమంది మోసగాళ్లు పోలీసుల వేషంలో వీడియో కాల్స్ చేసి భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి కాల్స్‌ను నమ్మకూడదని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు. అనుమానం ఉంటే వెంటనే 1930కి కాల్ చేయాలని వెల్లడించారు.