ADB: ఇచ్చోడ మండలంలోని జున్ని శివారు క్రషర్ ఆవరణలో మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. క్రషర్ ఆవరణలో మంటలు దావనంలా వ్యాపించి జున్నీ గ్రామం వరకు వెళ్లాయి. యువ రైతు విట్టల్ మొబైల్ సిగ్నల్ ప్రాబ్లం ఉండటంతో నేరుగా ఇచ్చోడ ఫైర్ స్టేషన్కు వెళ్లి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఆఫీసర్ మహమ్మద్ షఫీ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అర్పివేశారు.