TG: ఎండల తీవ్రతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. ఈనెల 23 వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన ఉందని పేర్కొన్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.