ATP: రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి రహదారుల విస్తరణ, మరమ్మతు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మంత్రి బి.సి.జనార్దన్ రెడ్డిని కోరారు. కల్యం నుంచి శ్రీరంగాపురం వరకు ప్రధాన రహదారిని డబుల్ లైన్‌గా విస్తరించాల్సిన అవసరాన్ని వివరించారు. మురుడి ఆంజనేయ స్వామి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా 48 కోట్లతో పనులు చేపట్టాలని కోరారు.